పేదల రాజ్యం కోసమే మా పోరాటం : బండి సంజయ్

 పేదల రాజ్యం కోసమే మా పోరాటం  : బండి సంజయ్

సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులివ్వడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సర్పంచుల నిధులు ఎత్తుకెళ్లిన దొంగ అని విమర్శించారు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తోందని మండిపడ్డ ఆయన.. అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా అని సంజయ్ సవాల్ విసిరారు. రాష్ట్రానికి 2,40,000 ఇళ్లను ఇచ్చిన కేంద్రం, నిధులు ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉందని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇయ్యని కేసీఆర్.. తన కోసం 100 రూముల ప్రగతిభవన్ కట్టుకున్నాడని మండిపడ్డారు. కొల్లపూర్లో ఎల్లేని సుధాకర్ రావు పాదయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. 

కేసీఆర్ ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే ప్రజల దగ్గరికి వస్తాడని బండి సంజయ్ విమర్శించారు. పేదోళ్ల రాజ్యం కోసమే తమ పోరాటమన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజాసమస్యలన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు పెట్టే టెన్షన్ తట్టుకోలేక కేసీఆర్ ఫుల్ తాగుతున్నాడని ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు బీఆర్ఎస్కు ఓట్లేసి మోసపోయారని.. మరోసారి మోసపోవద్దని సూచించారు.