8 జిల్లాల అధ్యక్షులతో బండి సంజయ్ భేటీ

8 జిల్లాల అధ్యక్షులతో బండి సంజయ్ భేటీ

హైదరాబాద్ చుట్టు పక్కల 8 జిల్లాల అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ లో జూలై 02, 03వ తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏర్పాట్లు, తదితర విషయాలపై చర్చించేందుకు బండి సంజయ్ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో సక్సెస్ చేసేందుకు ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించారని సమాచారం. హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు... జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి పిలుపువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది సోమవారం ఢిల్లీకి వెళ్లారు.

మంగళవారం బండి సంజయ్ తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం కార్పొరేటర్లతో మోడీ భేటీ కానున్నారు. గతంలో జీహెచ్ఎంసీలో (GHMC)లో బీజేపీ నుంచి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మ్రోగించింది. ఏకంగా 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే.. కార్పొరేటర్లు కీలక పాత్ర పోషిస్తారని.. ఇందుకు క్షేత్ర స్థాయిలో కార్యకర్తల అవసరం ఎంతో ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. అందుకే పార్టీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ భేటీ నిర్వహించారని.. ఫలితంగా ఫుల్ జోష్ తో నేతలు పని చేస్తారని యోచిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -
బండి సంజయ్ ను కూడా సస్పెండ్ చేయాలె


ఎమ్మెల్యే కొడుకుపై పోక్సో కేసు!