బండి సంజయ్ ను కూడా సస్పెండ్ చేయాలె

బండి సంజయ్ ను కూడా సస్పెండ్ చేయాలె

హైదరాబాద్: మైనారిటీలపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ  బీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి నుపుర్ శర్మను హైకమాండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇతర మతాలను కించపరచడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బీజేపే అగ్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ తన మాటలకు కట్టుబడి ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తక్షణమే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మసీదులను తవ్వివేయాలని, ఉర్దూను నిషేధించాలంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన బండి సంజయ్ ను ఎందుకు సస్పెండ్ చేయడంలేదని ప్రశ్నించారు. ‘జేపీ నడ్డాజీ.. నుపుర శర్మకు ఓ న్యాయం... బండి సంజయ్కు మరో న్యాయమా? ఎందుకీ తేడాలు? ఏమైనా స్పష్టత ఇవ్వగలరా?’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తల కోసం...

క్షమాపణ చెప్పాల్సింది దేశం కాదు.. బీజేపీ..

ఇవాళ, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన