క్షమాపణ చెప్పాల్సింది దేశం కాదు.. బీజేపీ..

క్షమాపణ చెప్పాల్సింది దేశం కాదు.. బీజేపీ..

హైదరాబాద్: గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడంటారా అంటూ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. గాంధీని గాడ్సే చంపడం కరెక్ట్ అని, గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ  బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీజేపీ మతోన్మాదులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలకు అంతర్జాతీయ సమాజానికి దేశ ప్రజలు ఎందుకు క్షమాపణ చెప్పాలని  పీఎం మోడీని నిలదీశారు.

దేశ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నందుకు బీజేపే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాతి పిత గాంధీజీపై ఎంపీ ప్రజ్ఞా సింగ్ అనుచితంగా కామెంట్ చేస్తే.. ప్రధాని మోడీ నోరు తెరవకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంపై పీఎం మోడీ ఏమీ మాట్లాడకపోవడాన్ని బట్టి చూస్తే మోడీ, అమిత్ షా వంటి బీజేపీ అగ్ర నేతలు దీని వెనుక ఉన్నారనిపిస్తోందని అన్నారు. ఇది దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు. 


మరిన్ని వార్తల కోసం...

ఢిల్లీకి బీజేపీ కార్పొరేటర్లు..

కన్నుల పండువగా రాధికా మర్చంట్‌ భరతనాట్య అరంగేట్రం