ఇవాళ, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన

ఇవాళ, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన
  • విజయవాడ, రాజమండ్రిలో పార్టీ నేతలతో బీజేపీ చీఫ్ భేటీ

అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ 8 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా.. ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇవాళ, రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న నడ్డా.. అక్కడి నుంచి నేరుగా విజయవాడ సిద్ధార్థ ఫార్సీ కాలేజ్ గ్రౌండ్ కు వెళ్లనున్నారు. ఏపీలో 40 వేలకు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలను 9 వేల శక్తి కేంద్రాలుగా వర్గీకరించిన బీజేపీ వాటికి ఇంఛార్జులను నియమించింది. వారితో జేపీ నడ్డా భేటీ కానున్నారు.

రాష్ట్ర కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శులతో భేటీ
సాయంత్రం 5 గంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా ప్రముఖులతో వెన్యూ ఫంక్షన్ హాల్ లో నడ్డా సమావేశం కానున్నారు. రాత్రికి బీజేపీ రాష్ట్ర కోర్  కమిటీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ బలోపేతానికి సంబంధించిన వ్యూహాలు, భవిష్యత్  కార్యాచరణపై చర్చించనున్నారు. రాత్రికి విజయవాడలోనే బస చేసి.. రేపు ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. తర్వాత రాజమహేంద్రవరంలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం బహిరంగసభలో పాల్గొని ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు. జనసేనతో పొత్తుపై ఎలా వెళ్లాలనేది పార్టీ జాతీయ నాయకులు నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.

 

ఇవి కూడా చదవండి

మంత్రులను నిలదీసిన ఆర్యవైశ్య నేతలు

కేవలం జీతమే..బెనిఫిట్స్​ లేవ్!

జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?