
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గిరిజనులకు పోడు భూములపై హక్కులు ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించకుండా హరితహారం నిర్వహించడం గిరిజనులను వంచించడమేనని బండి సంజయ్ విమర్శించారు. ఆ భూముల్లో హరితహారం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర అటవీ చట్టం ప్రకారం పోడు భూములపై గిరిజనులకు హక్కులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
https://twitter.com/bandisanjay_bjp/status/1530791243826941952?cxt=HHwWgMCqmdOhu74qAAAA
హరితహారం కార్యక్రమానికి తాము వ్యతిరేకం కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేవలం పోడు భూములలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న దాదాపు 3.5 లక్షల మంది గిరిజన రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం..
రైతులను నిండా ముంచిన సీఎం కేసీఆర్
తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని మభ్యపెడుతుండు