69 జీవోకు బీజేపీ అనుకూలం

69 జీవోకు బీజేపీ అనుకూలం

పాలమూరు జిల్లాను పచ్చగా చేసే అవకాశం ఉన్నా అభివృద్ది చేయాలనే ఆలోచన సీఎం కేసీఆర్ కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి సహకరించాలని, కేంద్రం చొరవతో 6 నెలల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు అందేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 69 జీవోకు బీజేపీ అనుకూలంగా ఉందని, మక్తల్, నారాయణపేట, కొడంగల్ లో బీజేపీని గెలిపిస్తే 69 జీవో అమలు చేస్తామన్నారు. పాలమూరు జిల్లా నుంచి వలసలు లేవని అంటున్న సీఎం కేసీఆర్ మాటల్లో నిజం కాదని, వలసలు ఉన్నాయని తాము నిరూపిస్తామని సవాల్ చేశారు. పాలమూరు మంత్రి రౌడీయిజం చేస్తున్నారని, ఆయన చిట్టా తమ దగ్గర ఉందన్నారు. మంత్రి కబంధ హస్తాల్లో ఉన్న పేదల ఆస్తులను లాక్కొని తిరిగి పేదలకే పంపిణీ చేస్తామన్నారు. గ్రూప్ నోటిఫికేషన్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కోర్టుకు వెళ్లమని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు గల్లీ గల్లీ తిరిగి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

శుక్రవారం విడుదలకు సిద్ధంగా మూడు సినిమాలు