ఉపాధి వేతనాల చెల్లింపులో జాప్యం

ఉపాధి వేతనాల చెల్లింపులో జాప్యం

నారాయణ పేట: ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, దీంతో కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధి హామీ కూలీల డబ్బులు పక్కదారి పడుతున్నాయని, కూలీల డబ్బు తినేటోల్ల లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం నారాయణ పేట జిల్లాలోని ధన్వాడ మండలం మణిపూర్ తండాలో పర్యటించిన బండి సంజయ్... ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ఉపాధి హామీ పని దినాలకు అదనంగా మరో 50 పని దినాలను పెంచాలన్న ప్రతి పాదనను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మూడు నెలలుగా ఉపాధి వేతనాలు రావడంలేదని కూలీలు ఫిర్యాదు చేయగా... కేంద్రం నుంచి నిధులు ఎప్పుడో రిలీజయ్యాయని బండి సంజయ్ జవాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టిస్తోందని, కావాలనే వేతనాల చెల్లింపులో జాప్యం చేస్తూ కేంద్రాన్ని బద్నాం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ఏడాదికి రూ.6 వేలు, ఉచితంగా కరోనా వ్యాక్సిన్, రేషన్ బియ్యం ఇస్తూ మోడీ ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

కొనుగోళ్లు ప్రారంభించాలని హైవేపై రైతుల ధర్నా

విద్య, వైద్యంపై సర్కార్ దృష్టి