కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాణం బంద్ :లక్ష్మణ్

కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాణం బంద్ :లక్ష్మణ్

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచక ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నారు. కాంగ్రెస్ నుండి పోయే వాళ్ళే తప్ప వచ్చే వారు ఎవరన్నా ఉన్నారా? ఉత్తం కుమార్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు లక్ష్మణ్.

మిలిటరీలొ పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశభక్తిని చూపించాల్సింది పోయి మతిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ బిల్ పెట్టినప్పుడు గందరగోళం చేసింది కాంగ్రెస్ ఎంపీలు కాదా? అని ప్రశ్నించారు. పెప్పర్ స్ప్రే కొట్టింది మీ పార్టీ ఎంపీ కాదా? అని అన్నారు. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయాన్ని కూడా రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదన్నారు.

ఉత్తమ్ కుమార్ బీజేపీ పై బురద జల్లుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిందని.. అధికార పార్టీ పై పోరాటం చేయలేక పోతోందన్నారు.టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యమ్నాయం అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సెక్రటేరియట్ ని కూల గొట్టడాన్నితాము వ్యతిరేకిస్తున్నామన్నారు.  కేసీఆర్ ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్నారని..ఎదో ఒక రోజు వాళ్ళు కర్రు కాల్చి వాతలు పెడతారని వ్యాఖ్యానించారు. వాజ్ పెయ్ స్మారకానికి స్థలం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు లక్ష్మణ్.