శబరిమలకు ప్రత్యేక ట్రైన్లు నడిపించాలి : వెరబెల్లి రఘునాథ్

శబరిమలకు ప్రత్యేక ట్రైన్లు నడిపించాలి : వెరబెల్లి  రఘునాథ్

మంచిర్యాల, వెలుగు: అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడిపించాలని, కేరళ ఎక్స్ ప్రెస్ రైలుకు మంచిర్యాల రైల్వేస్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి  రఘునాథ్ కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందజేశారు. 

మంచిర్యాల పట్టణం 2 టౌన్ కు రూ.3.5 కోట్లతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయడంతోపాటు మంచిర్యాలలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇచ్చినందుకు జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మార్వాడీ ప్రగతి సమాజ్ వినతి మేరకు చెన్నై సెంట్రల్ నుంచి భగత్ కి కోఠి(రాజస్థాన్) రైల్వేస్టేషన్​వరకు నడుస్తున్న రైలుకు మంచిర్యాల స్టేషన్​లో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.