పైసలు తీసుకొని ఓట్లేయించినప్పుడు దళిత కార్డు గుర్తు రాలేదా ?: వెరబెల్లి రఘునాథ్రావు

పైసలు తీసుకొని ఓట్లేయించినప్పుడు దళిత కార్డు గుర్తు రాలేదా ?: వెరబెల్లి రఘునాథ్రావు

మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో మానసిక క్షోభకు గురవుతున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు పేర్కొనడం సిగ్గుచేటని బీజేపీ స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్​ వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. ‘ఎంపీ ఎన్నికల్లో రూ.10 కోట్లు తీసుకొని ఓట్లేయించినప్పుడు, నీ ఇంట్లో ప్రెస్​మీట్ పెట్టినప్పుడు వంశీకృష్ణ దళిత కార్డు గుర్తు రాలేదా?’ అని ప్రశ్నించారు.

బుధవారం ఆయన మంచిర్యాలలోని పార్టీ జిల్లా ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. ప్రేమ్​సాగర్​రావు ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర ఏండ్ల కాలంలోనే  రూ.470 కోట్ల బ్యాంకు లోన్లు తీర్చాడంటే నియోజకవర్గంలో ఎంత దోపిడీ చేశాడో అర్థమవుతోందన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పైసల కోసం ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయించిన చరిత్ర నీదని గుర్తు చేశారు. ‘నీకు డబ్బు వచ్చే పనులకు ప్రయారిటీ ఇస్తావు. తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవు’ అని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ర్యాలీలు, మీటింగుల నిర్వహణలో పోటీ పడడం కాదని, డెవలప్​మెంట్​లో పోటీ పడాలని హితవు పలికారు.

వారికి ఫ్లెక్సీలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు. వారి గొడవల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. పీఎస్సార్​ ఎన్ని జిమ్మిక్కులు చేసినా మంచిర్యాల ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్  పార్టీకి దళితులపై నిజమైన ప్రేమ ఉంటే చేవెళ్ల డిక్లరేషన్​ను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.