ఖమ్మం నగరంలోని సమస్యలు పరిష్కరించాలి : నెల్లూరి కోటేశ్వరరావు

ఖమ్మం  నగరంలోని సమస్యలు పరిష్కరించాలి : నెల్లూరి కోటేశ్వరరావు
  • మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన జిల్లా అధ్యక్షుడు నెల్లూరి

ఖమ్మం టౌన్, వెలుగు : నగరంలోని సమస్యలు పరిష్కరించాలని, హిందూ దేవాలయాల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపుపై దృష్టి సారించాలని కోరుతూ బీజేపీ జిల్లా శాఖ గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కమిషనర్‌ను కలిసి క్షేత్రస్థాయి సమస్యలను వివరించారు. 

ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని శివారు డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, సైడ్ డ్రైన్స్ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచి దోమల బెడదతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పక్కా డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని, 23వ డివిజన్‌లోని ఇరుకు రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వరరావు, వీరెల్లి రాజేశ్​ గుప్తా, అల్లిక అంజయ్య, రవి గౌడు, బోయినపల్లి సురేశ్, కొమిలి శ్రీనివాస్, గడిల నరేశ్, చిన్ని కృష్ణ, తడుపునూరి రవీందర్ తదితరులు 
పాల్గొన్నారు.