యాదాద్రి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ తొక్కి పెట్టిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ఆరోపించారు. శనివారం భువనగిరిలో పార్టీ లీడర్ పోత్నక్ ప్రమోద్కుమార్తో కలిసి మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం చట్టం చేయడంతోపాటు ఆర్డినెన్స్ తెచ్చినా బీజేపీ పట్టించుకోలేదన్నారు. అయినా.. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. సాయి ఈశ్వర్ చారి మృతి ఎంతో బాధించిందని, అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
