మమ్మల్ని బీజేపీ బానిసలుగా చూసింది

V6 Velugu Posted on Jun 13, 2021

ముంబై: బీజేపీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలకు దిగారు. శివసేనను బీజేపీ బానిసగా చూసిందని ఆరోపించారు. 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు తమను బీజేపీ బానిసలుగా చూసిందని మండిపడ్డారు. జల్‌‌గావ్‌‌లో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో రౌత్ పైవ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రలో కిందటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శివసేనను సరిగ్గా పట్టించుకోలేదు. మమ్మల్ని బానిసలుగా చూశారు. మా మద్దతుతో వచ్చిన అధికారాన్ని ఉపయోగించి మా పార్టీనే విచ్ఛిన్నం చేయాలని చూశారు. ఇప్పుడు అలా కాదు. శివ సైనికులకేం దక్కపోయినా రాష్ట్రంలో నాయకత్వం మా పార్టీ చేతిలో ఉండటం సంతోషకరం. ఇదే నినాదంతో 2019 నవంబర్‌లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 

Tagged Bjp, mp Sanjay Raut, Shiv Sena, Maharashtra Government, maha vikas aghadi

Latest Videos

Subscribe Now

More News