బూత్కమిటీలను బలోపేతం చేయాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్

బూత్కమిటీలను బలోపేతం చేయాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: బలమైన బూత్​ కమిటీలు ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్​ నాయక్  తెలిపారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా ఆఫీస్​లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బూత్  నిర్మాణ్​ అభియాన్   నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూత్​లో బలమైన నాయకత్వం కలిగి ఉండాలన్నారు.

ఓటరు జాబితాను సమీక్షిస్తూ సమావేశాలు నిర్వహించాలన్నారు. అప్పుడే బలమైన బూత్​ కమిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు మండల స్థాయి బూత్​ నిర్మాణ్​ అభియాన్  కార్యక్రమాలు ఉంటాయని, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు బూత్  కమిటీల ఏర్పాటు చేయాలన్నారు.

ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకు బూత్​ లెవల్​ సమీక్షలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి 6 వరకు కమల్  ఉత్సవ్  నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిలిగారి రమేశ్​ కుమార్, కిసాన్  మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీ బాలకృష్ణ, నాయకులు నాగేశ్వర్ రెడ్డి, జయశ్రీ, అచుగట్ల అంజయ్య, గట్టు మల్లేశ్  పాల్గొన్నారు.