బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డాక్టర్లు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. యూరాలజీ, కార్డియాలజీ మరియు జెరియాట్రిక్ మెడిసిన్‌తో సహా వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యుల బృందం ఆయనను పరిశీలించారు.
డిశ్చార్జ్ చేయవచ్చిన చెప్పారు. అద్వానీ జూన్ 2002 నుండి మే 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా, అక్టోబర్ 1999 నుండి మే 2004 వరకు కేంద్ర హోం మంత్రిగా పనిచేశారు. 1986 నుండి 1990 వరకు, 1993 నుండి 1998 మరియు 2004 నుండి 2005 వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న కూడా అందుకున్నారు.
