ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్న బీజేపీ

ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్న బీజేపీ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి బీజేపీ అప్లికేషన్లు తీసుకోనుంది. సోమవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ రాష్ర్ట కార్యాలయంలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గాలవారీగా వచ్చిన అప్లికేషన్లను రాష్ర్ట నేతలు పరిశీలిస్తారు. 

ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపిస్తారు. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ఒక్కో సీటుకు భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.