హిమాచల్​లో బీజేపీ ఫోర్, సిక్స్ కొడతది : అనురాగ్ ఠాకూర్

హిమాచల్​లో బీజేపీ ఫోర్, సిక్స్ కొడతది : అనురాగ్ ఠాకూర్

హమీర్​పూర్: హిమాచల్ ప్రదేశ్​లో బీజేపీ ఫోర్లు, సిక్స్​లు కొట్టనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. రాష్ట్రంలోని 4 లోక్ సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరగనున్న 6 అసెంబ్లీ సీట్లను బీజేపీ గెలవనుందనే అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం హమీర్​పూర్​లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని,  మోదీని మళ్లీ ప్రధానిని చేయాలనుకుంటున్నారని చెప్పారు. ‘మేం రాముడి గుడి కడితే.. కాంగ్రెస్ మసీదును నిర్మిస్తామని చెబుతోంది. ప్రతిపక్షాలు సనాతన ధర్మాన్ని అణచివేస్తా మంటున్నాయి. మొఘలులు, బ్రిటీషర్లు వచ్చి వెళ్లిపోయినట్లే కాంగ్రెస్ కూడా పోతుంది. దేశంలో సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది’ అని పేర్కొన్నారు.