మోదీ ర్యాలీలే గెలిపించినయ్..

మోదీ ర్యాలీలే  గెలిపించినయ్..

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో బీజేపీ భారీ మెజార్టీ తో గెలిచింది. మోదీ 3 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భారీ ర్యాలీలు, సభలు, రోడ్​షోల తో ప్రజలను ఆకట్టుకున్నారు. గ్యారంటీలు ఇస్తూనే.. కాంగ్రెస్ అవినీతిని ప్రజలకు అర్థమయ్యే లా వివరించారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించా రు. చత్తీస్​గఢ్​లో 5 భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఇక మధ్యప్రదేశ్​లో 14 ర్యాలీలకు మోదీ హాజరయ్యా రు. యువతను ఆకట్టుకునేందు కు ప్రయత్నించారు. 30% కమీషన్ పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపడ్డారు. రాజస్థాన్ ఓటర్లు సంప్రదాయానికే ఓటేశారు. ‘రెడ్​ డైరీ’ అంటూ మోదీ చేసిన ప్రచా రం కాంగ్రెస్​కు ఓటమికి ప్రధాన కారణమైనట్లు తెలుస్తున్నది. రాజస్థాన్​లో మోదీ చేసిన విస్తృత ప్రచారం బీజేపీ గెలుపు నకు ఎంతో దోహదం చేసింది.