ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ మహిళా కౌన్సిలర్ల గోరింటాకు సంబరాలు

 ఆదిలాబాద్ పట్టణంలోని  బీజేపీ మహిళా కౌన్సిలర్ల  గోరింటాకు సంబరాలు

ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకా నగర్ మున్సిపల్ పార్క్ లో బీజేపీ మహిళా కౌన్సిలర్లు గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్​శంకర్​సతీమణి ఉమ సైతం పాల్గొన్నారు. 

మహిళలంతా ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. పనులతో బిజీ బిజీగా గడిపే మహిళా కౌన్సిలర్లు ఒక చోట చేరి సందడి చేయడంతో కోలాహలం నెలకొంది.
ఆదిలాబాద్, వెలుగు ఫొటోగ్రాఫర్