
మహారాష్ట్రలో బీజేపీ నాయకులు చేసిన చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమర్శలకు దారి తీసింది. థానేకు చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ కు చీర కట్టించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు చేతులు పట్టుకుని.. సరౌండ్ చేసి.. బలవంతంగా చీర కట్టించి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని థానేలో ఘోర అవమానకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో చేశాడని.. కాంగ్రెస్ నేతకు చీరకట్టించారు బీజేపీ కార్యకర్తలు. ధోంభివాలికి చెందిన స్థానిక కాంగ్రెస్ నేత ప్రకాశ్ అలియాస్ మామా పగారే.. ఇటీవల మోదీ మార్ఫింగ్ వీడియో షేర్ చేశారని ఆయనకు బలవంతంగా చీరకట్టించారు.
ధోంబివాలె కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పగారే.. సోమవారం (సెప్టెంబర్ 22) మోదీ ఎడిటెడ్ వీడియో పోస్ట్ చేశాడు. సారీ గర్ల్స్.. నేను కూడా ట్రెండ్ లో ఉండాలనుకుంటున్నా.. అంటూ ఆ క్యాప్షన్ ఇచ్చాడు. వీడియో బ్యాగ్రౌండ్ లో.. మి కశాలా అర్షాత్ పౌ గా.. అనే పాపులర్ మరాఠీ సాంగ్ ను ప్లే యాడ్ చేశాడు. ఈ వీడియోలో మోదీ చీర కట్టుకున్న మార్ఫిండ్ ఇమేజ్ ఉంటుంది. ప్రధాని మోదీని పగారే అవమానించారని ఈ పోస్ట్ పై కళ్యాణ్ జిల్లా బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు.
ఈ అంశంపై ఆందోళన నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు.. మంగళవారం ఉదయం.. దోంబివాలి ఈస్ట్ మన్పడా రోడ్ లో పగారేను రౌండప్ చేసి చీర కట్టించారు. జిల్లా బీజేపీ చీఫ్ నందు పరాబ్, మండల్ అధ్యక్షుడు కరణ్ జాదవ్.. ఇతర పార్టీ నేతలు.. ఆయనను పట్టుకుని బలవంతంగా చీర కట్టించారు.
తెల్ల కుర్తా, పైజామాలో ఉన్న పగారేను కార్యకర్తలు పట్టుకుని ఉండగా నేతలు చీర కట్టించారు. పగారే కోసమే 5 వేల రూపాయల చీర కొన్నట్లు చెప్పారు. మోదీని అవమానించినందుకు సరైన గుణపాఠం చెప్పాలని ఈ పని చేసినట్లు తెలిపారు.
అయితే చీర కడుతున్న సమయంలో పగారే గట్టిగా అరుస్తూ విడిపించుకునే ప్రయత్నం చేశాడు. ఏం చేస్తున్నారు.. వదలండి.. అంటూ అరిచినా విడిచిపెట్టకుండా.. మోదీని అవమానిస్తే ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. అందులో పార్టీ మెంబర్ ఒకతను.. పగారే చెంపపై కొట్టే ప్రయత్నం కూడా చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఫుల్లుగా ట్రెండ్ అవుతోంది.
తమ నేతల చర్యలను కళ్యాణ్ జిల్లా బీజేపీ పార్టీ సమర్ధించుకుంది. తమ నేతనలను అవమానిస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని హెచ్చిరించారు.
मुंबई से सटे कल्याण में कांग्रेस नेता मामा पगारे ने पीएम मोदी का साड़ी वाला फोटो वायरल किया तो कल्याण भाजपा ने साड़ी पहनाकर दिया जवाब #Maharashtra #MaharashtraCongress #BjpMaharashtra pic.twitter.com/zMAREXoXJU
— Vinod Jagdale (@iamvinodjagdale) September 23, 2025