
- గవర్నర్ను అవమానిస్తూ వ్యాసాలా?
- కేసీఆర్ చీఫ్ పీఆర్వోపై బీజేపీ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు స్వాగతం పలుకుతూనే.. మరోవైపు తన చీఫ్పీఆర్వోతో గవర్నర్ ను అవమానించేలా వ్యాసాలు రాయించారని బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడింది. గవర్నర్ నియామకాన్ని అవమానించేలా ‘గవర్నర్కు సంబంధించిన ఆధునిక కాలపు జిమ్మిక్కులు’ శీర్షికతో ఓ ఇంగ్లిష్ న్యూస్‌పేపర్‌లో ముఖ్యమంత్రి సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు రాసిన వార్త దేనికి సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసినరోజే ఈ వార్తను రాయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కుట్రేనని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇస్తూ.. వెంటనే గవర్నర్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.