
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను బీజేపీ తప్పుపట్టింది. బాంబులా పేలటం కాదని.. చల్లని నీటిలా ప్రవహించాలని హితవు పలికింది. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడారు. "రాహుల్ గాంధీ బాంబులా పేలుతారట..? వారి పని పేలడమే. ఇంకేం పని లేదు. అన్యాయం జరిగినట్లు అనుమానం ఉంటే ఎవరైన.. నేను సుప్రీంకోర్టుకు వెళ్తాను అంటారు.
కానీ రాహుల్ మాత్రం నేను ఎన్నికల సంఘంపై ఆటమ్ బాంబులా పేలుతాను అంటున్నారు. వారు అణుబాంబులు పేలిస్తే.. మేం రాజ్యాంగాన్ని కాపాడతాం. హిందీ సినిమాల్లో విలన్‌లా ‘నేను పేలుస్తాను, కొడతాను’ అని రాహుల్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి భాష మాట్లాడొద్దు. రాహుల్ గాంధీ బాంబులా పేలడం కాకుండా, చల్లని నీటిలా ప్రవహించాలి" అని సంబిత్ పాత్ర సూచించారు.