వకీల్ సాబ్ హిట్టు.. తిరుపతిలో బీజేపీ గెలుపు పక్కా

V6 Velugu Posted on Apr 10, 2021

తిరుపతి: పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ రిలీజ్ ఏపీలో వివాదానికి కారణమవుతోంది. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోలకు జగన్ సర్కార్ అనుమతిని ఇవ్వకపోవడంతో దుమారం రేపుతోంది. ఈ విషయంపై ఏపీ బీజేపీ కో-ఇన్ ఛార్జ్, జాతీయ సెక్రటరీ సునీల్ దియోధర్ స్పందించారు. దీన్ని పవన్ మీద ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడంగా చూడాలని చెప్పారు. ఇలాంటి చర్యలు సరికాదని మండిపడ్డారు.

'పవన్ కల్యాణ్ ను చూసి సీఎం జగన్ భయపడతున్నారు. అందుకే వకీల్ సాబ్ ఫిల్మ్ అన్ని బెనిఫిట్ షోలను రద్దు చేశారు. పవన్ సినిమా రిలీజ్ కే ఇంతగా భయపడుతున్నారు. మరి పవన్-మోడీ నేతృత్వంలో బీజేపీ, జనసేన రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే జగన్ పరిస్థితి ఏంటి? మీ రౌడీయిజం, అవినీతితో కూడిన కుటుంబ రాజకీయాలకు వ్యతిరేంగా మేం పోరాడతాం. వకీల్ సాబ్ సూపర్ హిట్ అవుతుంది. అదే సమయంలో తిరుపతిలో బీజేపీ- జనసేన అభ్యర్థి గెలవడమూ ఖాయం' అని సునీల్ ట్వీట్ చేశారు.

 

Tagged Tirupati, ELECTIONS, Pavan kalyan, vakeelsaab

Latest Videos

Subscribe Now

More News