ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఆరోపణలు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా ఆరోపణలు
  • ఇది దృష్టి మళ్లించే చర్యన్న సీబీఐ

న్యూఢిల్లీ: సీబీఐ అధికారి మరణంపై జ్యుడీషియల్​ ఎంక్వయిరీ జరిపించాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా డిమాండ్​ చేశారు. ఎక్సైజ్​ స్కాంలో తన పేరును ఇరికించాలని సదరు సీబీఐ అధికారిపై ఒత్తిడి తీసుకురావడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన సోమవారం ఆరోపించారు. అయితే సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది.

ఎక్సైజ్​ స్కాం దర్యాప్తుతో ఆ అధికారికి ఎలాంటి సంబంధం లేదని, ఇది తప్పుదారి పట్టించే ప్రయత్నమని మండిపడింది. ఢిల్లీ ఎక్సైజ్​ పాలసీ కేసుపై దర్యాప్తు నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నమని సీబీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ జితేంద్ర కుమార్ గత వారం దక్షిణ ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.