
జడ్చర్ల హైవేపై సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందన్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లేంతవరకు ఆందోళనకారులను స్పాట్ లోనే నిలిపేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి ఇటీవల చనిపోవటంతో.. పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ వెళ్తుండగా.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు బీజేవైఎం కార్యకర్తలు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.