కేసీఆర్ కాన్వాయ్‫ని అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలు

కేసీఆర్ కాన్వాయ్‫ని అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలు

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‭కు నిరసన సెగ తగిలింది.  కేసీఆర్ కాన్వాయ్‭ని అడ్డుకునేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నం చేశారు. జడ్చర్ల, కావేరమ్మ పేట జాతీయ రహదారి 44 పై ఈ ఘటన చోటుచేసుకుంది. కేసీఆర్ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న బీజేవైఎం కార్యకర్తలు.. సీఎం కాన్వాయ్‫ని అడ్డుకునేందుకు మూకుమ్మడిగా యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‭కి తరలించారు.

కేసీఆర్ వచ్చే సమయంలో.. కావేరమ్మపేట వద్ద బీజేవైఎం కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని.. అలాగే నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ నిధులు చేయాలని డిమాండ్ చేశారు.