పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందిస్తాం : కలెక్టర్ సంతోష్

పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందిస్తాం : కలెక్టర్ సంతోష్

గద్వాల/ కేటి దొడ్డి, వెలుగు : ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పూర్తి పారదర్శకంగా రూపొందిస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్ జాబితాపై పొలిటికల్ పార్టీ లీడర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. 

గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్లు మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోకుండా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

బైక్ పై వెళ్లి ఫీల్డ్ విజిట్ చేసిన కలెక్టర్..

మోటార్ బైక్ పై వెళ్లి ఫీల్డ్ లో భూభారతి దరఖాస్తులను కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. కేటిదొడ్డి మండలంలోని పాగుంట గ్రామ శివారులోని 13 సర్వే నంబర్​నిషేధిత భూముల జాబితాలో ఉండడంతో దరఖాస్తు చేసుకున్న స్థానిక రైతులను కలెక్టర్ ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే వివరాలు డాక్యుమెంట్లను కలెక్టర్ పరిశీలించారు. భూభారతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నిషేధిత భూములపై వచ్చిన ప్రతి దరఖాస్తులను ఫీల్డ్ సర్వే ఆధారంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.