వనపర్తి, వెలుగు : భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నూతన పోలీస్ స్టేషన్ భవనం నిర్మించాలని ఎస్పీ సునీతరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం అమరచింత పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేయాలని చెప్పారు. స్థల విస్తీర్ణం, రహదారి అనుసంధానం, ప్రజలకు అందుబాటులో ఉండే స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
