రాజకీయాలకు బీకేయూ దూరమని ​ప్రకటన

రాజకీయాలకు బీకేయూ దూరమని ​ప్రకటన

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోదని యూనియన్ లీడర్ రాకేశ్‌ తికాయత్ ఆదివారం స్పష్టంచేశారు. రాజకీయాలకు బీకేయూ దూరంగా ఉంటుందని చెప్పారు. అగ్రి చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఏడాదిపాటు చేసిన ఆందోళనలుముగించి రైతులు ఇండ్లకు తిరిగివెళ్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్​ తికాయత్​ రాజకీయాల్లోకి వస్తారని, త్వరలో జరగబోయే యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. వీటన్నింటిపైనా తన మద్దతుదారులకు త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పిన తికాయత్.. రాజకీయాలకు బీకేయూ దూరంగా ఉంటుందని ఆదివారం ప్రకటించారు.