బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు అధిక రేట్లకు అమ్ముతున్న ముఠా

V6 Velugu Posted on Jun 17, 2021

హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగిస్తున్న ఇంజెక్షన్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జూబ్లిహిల్స్, ఎస్.ఆర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో ముఠా పట్టుపడింది. మెడికల్ రెప్ శ్రీకాంత్ మరో నలుగురితో కలసి దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సుమారు రూ.7వేలు విలువ చేసే ఇంజెక్షన్ ను ముఠా సభ్యులు రూ.35 నుంచి 50 వేల వరకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరో ముఠాలో బాలస్వామి అనే అతడు రింగ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నట్లు తేలింది.  పోలీసులు తనిఖీలు చూసి గుంటూరుకు చెందిన మరో నిందితుడు పరారయ్యాడు. పట్టుపడిన 9 మంది నిందితుల నుంచి 28 ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను హైదరాబాద్ సీపీ అంజని కుమార్ మీడియాకు చూపించారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.వీరి దందాపై మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. 

Tagged Hyderabad CP Anjani Kumar, Hyderabad Today, , black fungal medicine black market, medicine selling at high rates, hyderabad taskforce police

Latest Videos

Subscribe Now

More News