బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు..ఐదుగురికి తీవ్రగాయాలు

బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు..ఐదుగురికి తీవ్రగాయాలు

బెంగళూరులోని  రామేశ్వరం ప్రాంతంలో ప్రముఖ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం ( మార్చి 1, 2024) బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ముగ్గురు కేఫ్ సిబ్బంది కాగా, ఇద్దరు కస్టమర్లుగా గుర్తించారు. మధ్యాహ్నం ఒంటిగంట  ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.

భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా కస్టమర్లు భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. పేలుడు విషయం తెలుసుకున్న వైట్ ఫీల్డ్ ఏరియా డిప్యూటీ  పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతమంతా తనిఖీలు చేపట్టారు. రామేశ్వరం కేఫ్ బెంగుళూరులోని అత్యంత ప్రసిద్ధ ఫుడ్ జాయింట్ లలో ఒకటి. 

ALSO READ :- Gaami Movie: గామి అర్ధం ఏంటంటే?..టైటిల్ సీక్రెట్ చెప్పిన డైరెక్టర్