నాసిక్​ పాలిథీన్​ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి

నాసిక్​ పాలిథీన్​ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి

నాసిక్​: మహారాష్ట్ర నాసిక్​లోని ముండేగావ్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిందాల్​ గ్రూప్​ పాలిథీన్​ తయారీ యూనిట్​లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్​లో ఇద్దరు చనిపోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. కెమికల్​ ప్లాంట్​ బాయిలర్​లో పేలుడుతో మంటలు చెలరేగాయి. పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయారు. ఫైరింజన్లతో అధికారులు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. 

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ ​షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. 19 మందిని కాపాడినట్టు వెల్లడించారు. 17 మందిని దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించి ట్రీట్​మెంట్​ ఇస్తున్నామన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరు చనిపోయారనివెల్లడించారు. సహాయక చర్యల కోసం నాసిక్​ జిల్లాలోని ఎయిర్​ ఫోర్స్ స్టేషన్​ నుంచి హెలికాఫ్టర్ ను తెప్పించామని వివరించారు. న్యూ ఇయర్​ కావడంతో ఫ్యాక్టరీలో చాలా తక్కువ మంది పనికొచ్చారని సీనియర్​ అధికారి తెలిపారు.