Su From So OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్.. 6 కోట్ల బడ్జెట్..120 కోట్ల వసూళ్లు..

Su From So OTT: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్.. 6 కోట్ల బడ్జెట్..120 కోట్ల వసూళ్లు..

కన్నడ లేటెస్ట్ సూపర్ హిట్ హారర్-కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే బ్లాక్‌బస్టర్ మూవీ ‘సు ఫ్రమ్ సో’ (Su From So). నటుడు రాజ్ బి శెట్టి నటించి, నిర్మించిన ఈ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 9) నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. కన్నడతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో జియోహాట్‌స్టార్లో అందుబాటులో ఉంది.

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. ఇక్కడి థియేటర్లో 60% ఆడియన్స్కి పైగా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశారు. కానీ, సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్, కళ్ళు చెదిరే బాక్సాఫీస్ కలెక్షన్స్.. వంటి విషయాలు చాలా ఆలస్యంగా తెలుగు ఆడియన్స్ గుర్తించారు. ఈ క్రమంలో సినిమా చూడాలని అనుకున్నప్పటికీ, థియేటర్స్ నుంచి మూవీ వెళ్ళిపోయింది. ఇక ఓటీటీలోనైన చూడాలని ఆడియన్స్ వెయిట్ చేస్తూ వస్తున్నారు. నేటితో వారి నిరీక్షణకు ఎండ్ కార్డ్ పడింది. 

‘సు ఫ్రమ్ సో’ బడ్జెట్ & కలెక్షన్స్:

‘సు ఫ్రమ్ సో’ మూవీ జులై 25న కన్నడ, ఆగస్టు 8న తెలుగు థియేటర్లలో రిలీజై ఘన విజయం సాధించింది. కేవలం రూ.6 కోట్ల లోపు బడ్జెట్తో మూవీ తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.120 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు, రూ.90 కోట్లకి పైగా ఇండియా నెట్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో దాదాపు రూ.15 కోట్లకి పైగా వసూళ్లు దక్కించుకుంట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 

రూరల్ హారర్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెపీ తుమినాడ్ తెరకెక్కించాడు. గ్రామాల్లో సహజంగా ఉండే మూఢ నమ్మకాలు, జానపద కథల మేళవింపుతో ఆసక్తి రేకిత్తించే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో శనీల్ గౌతమ్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించగా శాంధ్య ఆరకెరె, ప్రకాశ్ తుమినాడ్ ఇతర పాత్రలు పోషించారు. దర్శకుడు కీలకపాత్ర పోషించాడు. 

సూ ఫ్రమ్ సో కథ:

ఆవారాగా తిరిగే అశోక్‌‌‌‌‌‌‌‌ అనే కుర్రాడి చుట్టూ మూవీ స్టోరీ సాగుతోంది. అతను ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అతడు ఆ అమ్మాయి ఉండే ఊరికి వెళతాడు. ఆ తర్వాత ఆ ఊర్లో కొన్ని ఊహించని సంఘటనలు జరగడం, జనంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో, అతనిని సోమేశ్వర నుంచి వచ్చిన సులోచన అనే దెయ్యం ఆవహించిందని పుకార్లు వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊర్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరికి తన ప్రేమను సాధిస్తాడా? అసలు సులోచన ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.