ఆర్ట్స్ పేరుతో వృథా అవుతున్న రక్తం

ఆర్ట్స్ పేరుతో వృథా అవుతున్న రక్తం
  • స్టూడియోల్లో బ్లడ్​తో గిఫ్ట్స్​...దక్షిణాదిలో ట్రెండింగ్
  • తమిళనాడులో అధికారికంగా నిషేధం
  • ప్రపంచ వ్యాప్తంగా బ్లడ్​ షార్టేజ్​
  • ఇండియాలోనూ అదే పరిస్థితి

ఇష్టమైన వాళ్లకు అకేషన్​లకు గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. అయితే, ఇచ్చే గిఫ్ట్ ​స్పెషల్​గా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, మరీ రక్తంతో తయారు చేసిన గిఫ్ట్​ అంటేనే ఆలోచించాలి. సౌతిండియాలో బ్లడ్​ఆర్ట్స్​ కల్చర్​ఎక్కువగా నడుస్తున్నది. మరీ ముఖ్యంగా తమిళనాడు యూత్​ రక్తంతో వేసే ఆర్ట్స్​ను గిఫ్ట్​గా ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు. దాని  వల్ల  కలిగే ఇబ్బందులను గమనించిన అక్కడి ప్రభుత్వం.. పోయిన ఏడాది డిసెంబర్​ 28న ‘బ్లడ్​ఆర్ట్స్​’​పై నిషేధం విధించింది. ఇలా చేయడం ‘‘ఫ్రీడం ఆఫ్​ ఎక్స్​ప్రెషన్’’​ను అడ్డుకోవడమే అవుతుందని చాలా మంది గొంతు చించుకున్నా.. ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ తరహా గిఫ్ట్ ఇచ్చినా.. తీసుకున్నా చట్టరీత్యా నేరం అని తేల్చి చెప్పింది. అసలు బ్లడ్ ఆర్ట్ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఇబ్బందులేంటో తెలుసుకుందాం..

ప్రపంచ వ్యాప్తంగా బ్లడ్​ షార్టేజ్​

బ్లడ్ ఆర్ట్ గురించి తెలుసుకునే ముందు ఇండియాలో బ్లడ్​ షార్టేజ్​పై లుక్కేద్దాం. ఇక్కడున్న బ్లడ్ ​ బ్యాంకులు తీవ్రమైన రక్తం కొరత ఎదుర్కొంటున్నాయని ఓ స్టడీ లో తేలింది. 192 దేశాల్లో లాన్సెంట్​ హిమటోలాజీ జరిపిన స్టడీలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్​ మిల్లీ లీటర్ల రక్తం కొరత ఉంది. ఇండియా విషయానికొస్తే.. అందులో 40శాతం బ్లడ్ షార్టేజ్​ ఉంది. డిమాండ్, సప్లైలో 400 శాతం తేడా కనిపిస్తున్నది. 

ఏ3 సైజ్​ ఆర్ట్​ కోసం 10 మిల్లీ లీటర్ల రక్తం

ప్రపంచమంతా బ్లడ్​ కొరతతో ఇబ్బంది పడుతుంటే.. కొందరు మాత్రం ఎదుటివాళ్ల ప్రేమను పొందేందుకు రక్తంతో ఆర్ట్స్​ తయారు చేసి ఇస్తున్నారు. ముఖ్యంగా లవర్స్​ ఈ బ్లడ్​ ఆర్ట్స్​కు పిచ్చోళ్లు అయిపోయారు. తమ ఎమోషన్స్​ను ఈ రూపంలో చూపిస్తున్నారు. ఇంకొందరైతే రక్తంతో లెటర్​ రాసి ఎదుటోళ్ల మనసులు గెలుచుకునే స్థాయికి చేరిపోయారు. ఏ4 సైజ్​ పేపర్ బ్లడ్​ ఆర్ట్​ కోసం 5 మిల్లీ లీటర్ల రక్తం అవసరం ఉంటుంది. ఏ3 పేపర్​ బ్లడ్​ ఆర్ట్​ కోసం 10 మిల్లీ లీటర్ల పైనే బ్లడ్​ కావాలి. బ్లడ్ ఆర్ట్స్​ కోసం సౌతిండియాలో స్పెషల్​ స్టూడియోలు కూడా ఓపెన్​ చేశారు. సేకరించిన బ్లడ్​లో ‘యాంటీ కోగ్యులెంట్స్’ అనే కెమికల్​ కలిపి స్టోర్​ చేస్తున్నారు. 

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనూ

బ్లడ్​ ఆర్ట్​ అనేది కొత్తదేమీ కాదు. ఇండియాతో పా టు విదేశాల్లోనూ చూశాం. రక్తంతో రాసిన ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన తెలిపిన రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో అయితే స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో చాలా మంది తమ డిమాండ్లను రక్తంతో రాసి ప్రదర్శించారు. ఇలాంటి ఆర్ట్స్​ను ‘షాక్​ ఆర్ట్స్’ అంటారు. ఇది చూసిన వారంతా షాక్​కు గురవుతారు. ఇదే ఈ ఆర్ట్స్​ స్పెషల్​. 

సూసైడ్​ చేసుకోవాలనిపించే ఆర్ట్స్​

వరల్డ్​ ఫేమస్​ ఆర్టిస్ట్​ ఫ్రాన్సిస్కో డీ గోయ్​ వేసిన ఓ పెయింటింగ్​ చూస్తే సూసైడ్ చేసుకోవాన్న ఆలోచన వస్తుంది. ఇది నిజం.. దీన్ని 19వ సెంచరీలో ప్రదర్శనకు పెట్టారు. దీనికి ‘ది బ్లాంక్​ పెయింటింగ్స్’ అని పేరు పెట్టాడు. లావుగా.. బట్టల్లేకుండా ఉన్న ఓ మనిషి చిన్న పిల్లాడిని తింటున్న ఫొటో చాలా వైరల్​ అయ్యింది. దాన్ని చూసే డీ గోయ్ ​సూసైడ్​ చేసుకున్నాడనే వార్తలు వినిపించాయి. 

తమిళనాడులో బ్యాన్​

స్టూడియోల్లో బ్లడ్​ ఇవ్వడం చాలా ప్రమాదకరమంటున్నారు హెల్త్​ ఎక్స్​పర్ట్స్. పొరపాటున ఇన్​ఫెక్ట్​ అయిన సూదితో బ్లడ్​ తీస్తే కచ్చితంగా హెచ్​ఐవీ/ఎయిడ్స్, హెపటైటిస్ వంటి రోగాలబారినపడ్తారని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్టూడియోల్లో ప్రొటోకాల్​ పాటించడం లేదనే విషయం తెలుసుకున్న తమిళనాడు హెల్త్​ మినిస్టర్​ ఎంఏ సుబ్రమణ్యం.. తమ రాష్ట్రంలో పోయిన ఏడాది డిసెంబర్​ 28న బ్లడ్​ ఆర్ట్స్​పై నిషేధం విధించారు.