
కోల్బెల్ట్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాల కల్పనకు బ్లూ డాన్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. హైదరాబాద్కు చెందిన బ్లూ డాన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి పట్టణం ఒర్రెగడ్డ ఏరియాలోని జడ్పీ బాయ్స్హైస్కూల్కు సుమారు రూ.3లక్షల విలువైన 50 డ్యూయల్ డెస్క్ బెంచీలను ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్తో కలిసి డీఈవో అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్కమిషనర్ తుంగపిండి రాజలింగు, సింగరేణి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఎంఈవో దత్తుమూర్తి, స్కూల్ హెచ్ఎం పద్మజ, బ్లూడాన్ సంస్థ ప్రతినిధులు విదుమౌళి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బ్యాగుల అందజేత
రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియం ఏరియాలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లోని 40 మంది విద్యార్థులకు ‘యువత.. జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్కూల్బ్యాగులను క్యాతనపల్లి మున్సిపల్కమిషనర్ గద్దె రాజు అందజేశారు. సంస్థ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్, వెరైటీ తిరుపతి, కరుణాకర్, గణేశ్ పాల్గొన్నారు.