
బ్లూ మూన్ కనువిందు చేసింది. ఒకే నెలలో రెండు పౌర్ణమిలు ఏర్పడితే దాన్ని బ్లూ మూన్‌గా పిలుస్తారు. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి 9.30 గంటలకు బ్లూ మూన్ కనిపించగా.. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెలుగు ఫొటొగ్రాఫర్ ఇలా క్లిక్ మనించాడు. బుధవారం ఏర్పడిన బ్లూ మూన్ అరుదైనదని సైంటిస్టులు చెబుతున్నారు. 2009 డిసెంబర్‌లో చివరిసారిగా బ్లూ బూన్ కనిపించగా.. మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఏర్పడనుంది. అయితే, ఇయ్యాల ఉదయం 7 గంటలకు చంద్రుడు సూపర్ బ్లూ మూన్‌గా కనిపించనున్నాడు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ బ్లూన్ రావడం అత్యంత అరుదని సైంటిస్టులు చెబుతున్నారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, హైదరాబాద్