నవంబర్ 29నుంచి బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్

నవంబర్ 29నుంచి బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్

ట్విట్టర్ లో బ్లూటిక్ పేయిడ్ సబ్ స్క్రిప్షన్ సేవల్ని మళ్లీ తిరిగి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు మస్క్. బ్లూ టిక్ సేవలు ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఫీచర్లని ట్విట్టర్ లో రోల్ అవుట్ చేసి, సేఫ్టీ, సెక్యూరిటీని పెంచుతూ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ తిరిగి తీసుకొస్తున్నారు.

ఫేక్, ఫ్రాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసి, ఆ అకౌంట్లకి బ్లూటిక్ కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల చాలామంది ట్విట్టర్ యూజర్లు.. సెలబ్రిటీల అసలు అకౌంట్ ఏదో, నకిలీ అకౌంట్ ఏదో కనిపెట్టడం కష్టంగా మారింది. దాన్ని తగ్గించడానికి మొన్న బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ని తాత్కాలికంగా నిలివేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే, సమస్యలను పునరుద్ధరించి, నవంబర్ 29 నుంచి మళ్లీ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ కావాలంటే నెలకు 8 డాలర్లు, అంటే 719 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. బ్లూ టిక్ పునరుద్ధరణలో స్కామర్లు, ఫ్రాడ్ అకౌంట్లను ఎలా నియంత్రిస్తారో తెలియలేదు.