నిమిషంలో ఆరు వైటల్స్​ను చెక్ చేయగల డివైజ్​ ‘ఈవా’ లాంచ్​

 నిమిషంలో ఆరు వైటల్స్​ను చెక్ చేయగల డివైజ్​ ‘ఈవా’ లాంచ్​

హైదరాబాద్​, వెలుగు: సిటీకి చెందిన హెల్త్​-టెక్ కంపెనీ బ్లూసెమీ కేవలం నిమిషంలో ఆరు వైటల్స్​ను చెక్ చేయగల డివైజ్​ ‘ఈవా’ను లాంచ్​ చేసింది. దీనిపై రెండు వేళ్లు పెట్టగానే  ఎలక్ట్రో కార్డియోగ్రామ్(ఈసీజీ),  హార్ట్​రేట్​, రక్తపోటు, ఆక్సిజన్​ లెవెల్స్​, బ్లడ్​ గ్లూకోజ్​, హెచ్​ఏ1సీలను చెక్​చేస్తుంది.  ఇందుకోసం డివైజ్​ను ఈవా మొబైల్​ యాప్​కు కనెక్ట్​ చేయాల్సి ఉంటుంది. సెన్సర్ ఫ్యూజన్, ఏఐ అల్గారిథమ్‌‌‌‌లు,  ఐఓటీలతో (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఇది పనిచేస్తుంది. ఆరు వైటల్స్​లో  ఏదైనా పరిమితికి మించి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాప్​ వివరిస్తుంది.

భారతదేశంలో ఈవా ధర రూ. 16,650 కాగా, ఎర్లీబర్డ్​ ఆఫర్​ కింద రూ.15,500లకు అందజేస్తున్నామని బ్లూసెమీ సీఈఓ సునీల్​ మద్దికట్ల చెప్పారు. టీ–హబ్​లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘2017లో ఏర్పాటైన బ్లూసెమీకి టీ–హబ్​,  -హైదరాబాద్‌‌ ఐఐటీ, నాస్కామ్​ నుంచి మద్దతు లభించింది. డీఎస్​టీ, మైటీ నుంచి కూడా నిధులు అందాయి.   త్వరలో 69 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 510 కోట్లు) సేకరించనున్నాం. మరిన్ని నిధుల కోసం రాబోయే రెండేళ్లలో ఐపీఓకి కూడా వస్తాం. ఈ డివైజ్​ను బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్​లోని అసెంబ్లింగ్​ ప్లాంట్లలో తయారు చేస్తున్నాం. ఇప్పటికే 1,800 డివైజ్​లను అమ్మాం. వీటికి విపరీతంగా గిరాకీ ఉంది. ఈ ఏడాది 70 వేల యూనిట్లు అమ్మాలని టార్గెట్​గా పెట్టుకున్నాం. ఈవా ఇచ్చే రిజల్ట్స్ 90 శాతం కచ్చితత్వంతో ఉంటాయి. అయితే ఇది మెడికల్​ గ్రేడ్​ డివైజ్​ కాదు”అని ఆయన వివరించారు.