
హైదరాబాద్, వెలుగు: మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ బ్లూ వాటర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఐపీఓ ఈ నెల 27న మొదలై 29న ముగుస్తుంది. యాంకర్ పోర్షన్26న ఉంటుంది. ఈ హైదరాబాద్ కంపెనీ ఇష్యూ నుంచి రూ.40.50 కోట్లు సేకరించాలని భావిస్తోంది.
ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో ఇది లిస్ట్ అవుతుంది. ప్రైస్బ్యాండ్ను రూ.132–135గా నిర్ణయించారు. లాట్ సైజు 1,000 ఈక్విటీ షేర్లుగా ఉంటుంది. ఈ ఐపీఓలో బుక్-బిల్డింగ్ మార్గం ద్వారా రూ.10- ముఖ విలువ కలిగిన 30 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది.
నిధులను వ్యాపార విస్తరణకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడతారు.