బీఎమ్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు

బీఎమ్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ భారతదేశంలో మరో ఆల్-ఎలక్ట్రిక్ కారు బీఎమ్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ ఐ5 ఎం60 ఎక్స్‌‌‌‌‌‌‌‌డ్రైవ్‌‌‌‌‌‌‌‌ను రూ.1.19 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది.  ఈ కారు  రెండేళ్ల వారంటీతో వస్తుంది.  ఎటువంటి మైలేజ్ పరిమితి లేకుండా మూడవ సంవత్సరం   నుంచి గరిష్టంగా ఐదవ సంవత్సరం వరకు వారంటీ ప్రయోజనాలను పొడిగించవచ్చు.  

భద్రత కోసం ఇందులో ఆరు ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌లు, అటెన్టివ్‌‌‌‌‌‌‌‌నెస్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ , కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌‌‌‌‌‌‌‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్- ఇంపాక్ట్ ప్రొటెక్షన్ వంటివి ఉన్నాయి. కారు 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 230 కి.మీ కాగా,  మైలేజీ 516 కిలోమీటర్ల వరకు ఉంటుంది.