వాటర్​బోర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : దానకిశోర్

వాటర్​బోర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : దానకిశోర్
  •     కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీని కోరిన బోర్డు డైరెక్టర్ దానకిశోర్

హైదరాబాద్, వెలుగు :  వాటర్ బోర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బోర్డు డైరెకర్ట్ దానకిశోర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం వాటర్​బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీని కలిసిన  దానకిశోర్ వాటర్ బోర్డు ఉద్యోగుల సమస్యల గురించి ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. వాటర్​బోర్డులో దాదాపు వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటి భర్తీకి కృషి చేస్తానన్నారు.

ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని ఆయన చెప్పారు.మధుయాష్కీని కలిసిన వారిలో వాటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్​కుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, అల్లి శ్రవణ్​కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆనంద్ రెడ్డి, రాజ్ తదితరులు ఉన్నారు.