
పరిగి, వెలుగు: యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని రైతులు ఆరోపించారు. యూరియా ఏ ఫర్టిలైజర్షాపులో ఎంత ఉందనేది తెలిసేలా మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట బోర్డులు పెట్టాలని డిమాండ్చేశారు. మంగళవారం దోమ మండల కేంద్రంలోని ఆగ్రోస్షాపు ఎదుట యూరియా కోసం క్యూలైన్లో బారులుదీరారు.
పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల రైతులందరం వ్యవసాయ పనులు పక్కన పెట్టి ప్రతీరోజు యూరియా కోసం తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని, ఫోన్చేస్తే ఎత్తడం లేదని వాపోయారు.