మారిటానియా: ఆఫ్రికాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సోమవారం గాంబియా నుంచి 300 మందితో యూరప్ వైపు వెళ్తున్న బోటు మారిటానియా రాజధాని నౌక్‌చాట్ వద్ద అట్లాంటిక్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. 150 మందికిపైగా గల్లంతయ్యారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) బుధవారం తెలిపింది. మారిటానియన్ కోస్టుగార్డ్ సిబ్బంది 120 మందిని రక్షించారని పేర్కొంది. గల్లంతైనవారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించింది.
