గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి : మహ్మద్​ షకీల్

గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి : మహ్మద్​ షకీల్

ఎడపల్లి, వెలుగు: గ్రామీణ ప్రాంతాలు ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, దేశం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్​షకీల్ పేర్కొన్నారు. శనివారం ఆయన రూర్బన్ పథకంలో భాగంగా ఎడపల్లిలో రూ.5 కోట్లతో నిర్మించిన వివిధ నిర్మాణాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రారంభించిన వాటిలో మినీ స్టేడియం, క్లస్టర్ కమ్యూనిటీ హాల్, ఫిష్ మార్కెట్, మార్కెట్ షెడ్ , లైబ్రరీ , ఆడిటోరియం, పశు వైద్యశాల మొదలైనవి ఉన్నాయి.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బీఆర్ఎస్​కట్టుబడి ఉందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల మాధవి, శ్రీనివాస్, పార్టీ మండలా ధ్యక్షుడు శ్రీరామ్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ రజిత యాదవ్, ఎంపీపీ కె.శ్రీనివాస్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, ఎంపీటీసీ షేక్ జావిద్​ బాబా, మనీషా, సింగిల్ విండో చైర్మన్ పోల మల్కా రెడ్డి, స్రవంతి, లీడర్లు వెంకయ్య గారి రాంరెడ్డి,  భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, బాబర్ పాల్గొన్నారు.