మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్రూం ఇండ్లు

మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్రూం ఇండ్లు

 

  • అర్హులకు అందని డబుల్  బెడ్ రూం ఇండ్లు
  • బోడుప్పల్​ పరిధి రాజీవ్​నగర్​లో మందుబాబులకు అడ్డాగా మారినయ్​

మేడిపల్లి, వెలుగు : టీఆర్​ఎస్​ సర్కార్​ గ్రేటర్​లో ఆడంబరంగా డబుల్​ బెడ్రూం ఇండ్లను కడుతున్నామని చెబుతున్నా, వాటిని లబ్ధిదారులకు ఇయ్యడంలో మాత్రం లేట్ ​చేస్తోంది.  బోడుప్పల్ కార్పొరేషన్​ పరిధి రాజీవ్ నగర్ లో  కట్టిన 74  డబుల్​బెడ్రూం ఇండ్లు  ప్రజలకు ఇవ్వకముందే శిథిలావస్థకు చేరాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి మందుబాబులు సిట్టింగ్ లు వేసి తాగిన మత్తులో కిటికీల అద్దాలు, డోర్లు పగుల గొడుతున్నా పట్టించుకునే వారు లేరు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే..

రాజీవ్ నగర్ లో  కట్టిన  డబుల్​బెడ్రూం ఇండ్లను 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. 74 ఇండ్లకు 15 వేల మంది అప్లై చేసుకొని ఎదురుచూస్తున్నారు.  దీంతో ఎవరికి ఇండ్లు  ఇవ్వాలనే దానిపై అధికారులు అయోమయంలో పడిపోయారు.  వేలాది మంది అర్హులుంటే 74 ఇండ్లు కడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటని జనం సర్కార్​ను ప్రశ్నిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం కట్టిన ఇండ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వటం లేదంటూ స్థానిక ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు.  సర్కార్​ వెంటనే స్పందించి పేదలకు డబుల్​ బెడ్ రూం ఇండ్లను ఇవ్వాలని  స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ తోటకూర అజయ్ యాదవ్ డిమాండ్ చేశారు.