
హైదరాబాద్, వెలుగు : ఇంక్యుబేషన్ సెంటర్ టీ–హబ్ నుంచి వచ్చినవారి కోసం వింగ్స్ ఇండియా 2024లో బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ రీజనల్ ఫైనల్‌లను నిర్వహించింది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమంలో, టీ–హబ్ నుంచి ఎంపిక చేసిన స్టార్టప్ ఫౌండర్లు
స్టూడెంట్లు ఏరోస్పేస్ రక్షణ, సాంకేతికత, సామాజిక ప్రభావం వంటి వాటిపై తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బోయింగ్ మెంటార్లు పరిశ్రమ నిపుణులతో, ఫైనలిస్ట్‌లతో మాట్లాడారు. ఆలోచనలను బిజినెస్‌గా మార్చడానికి మార్గాలను సూచించారు.