
హైదరాబాద్, వెలుగు: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఎండీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బీఓఐ ఎన్‌బీజీ సౌత్ 2, తెలంగాణ జోనల్ ఆఫీస్‌ను రాజ్‌నీష్ కర్నాటక మంగళవారం సందర్శించారు. సిటీలోని కొంత మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్, కార్పొరేట్ క్లయింట్లతో సమావేశం అయ్యారు. ఎకానమీలోని అవకాశాల గురించి వీరికి వివరించారు. ఆ తర్వాత బీఓఐ సిటీ బ్రాంచుల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో రాజ్‌నీష్ సమావేశమయ్యారు. దేశ ఎకానమీ, బ్యాంకింగ్ సెక్టార్ గ్రోత్‌లో బీఓఐ కృషిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అందరికీ ఆర్థిక ఫలాలు అందాలని, దేశ నిర్మాణంలో కీలకమైన స్కీమ్‌లకు ప్రయారిటీ ఇవ్వాలని ఉద్యోగులకు పిలుపిచ్చారు. హైదరాబాద్, బెంగళూరు వంటి వేగంగా విస్తరిస్తున్న మెట్రో సిటీలలో రిటైల్ లోన్లు ఇవ్వడం పెంచాలన్నారు. కాగా, హుబ్బళ్లి ధర్వాద్, విజయవాడ, విశాఖపట్నంలోని బ్యాంక్ బ్రాంచులు కూడా బీఓఐ ఎన్‌బీజీ సౌత్ 2 జ్యూరిస్‌డిక్షన్ కిందకు వస్తాయి.