ఆస్పత్రి నుంచి బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ డిశ్చార్జ్ 

V6 Velugu Posted on Jun 11, 2021

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఆయనను ముంబైలోని హిందూజా ఆస్పత్రి నుంచి ఇవాళ(శుక్రవారం) డిశ్చార్జి చేశారు. అయితే.. ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ కొనసాగించాలని డాక్టర్లు తెలిపారు.

98 ఏళ్ల దిలీప్ కుమార్ ఇటీవల తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ నెల 6న జరిపిన వైద్య పరీక్షలో ఆయన బైలేటరల్ ప్లూరల్ ఎఫ్యూజన్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది.

Tagged hospital, Bollywood actor, Dilip Kumar, discharged

Latest Videos

Subscribe Now

More News