
ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ది వీక్’ మ్యాగజీన్ ప్రతి ఏడాది ప్రకటించే ప్రతిష్టాత్మక మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఈయేడు సోనూ నిలిచాడు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో వలస కూలీలకు సోనూ సాయం చేశాడు. ఆ తర్వాత కూడా తన హెల్ప్ కోరిన వారికి చేయూత అందించి రియల్ లైఫ్ హీరోగా పేరు సంపాదించాడు. సర్జరీలకు డబ్బులు, స్కాలర్‌షిప్ ఇవ్వడం, మహిళా హక్కుల కోసం ఉద్యమించడం సోనూకు మరింత క్రేజ్ సంపాదించి పెట్టింది. సోనూ మాదిరిగా బయటకొచ్చి ప్రజలకు సాయం చేసిన సినీ సెలబ్రిటీలు తక్కువేనని చెప్పాలి.